తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని కరాడ్పల్లి, జనగాం, లింగంపల్లి మధ్య ఉన్న ఉన్నటువంటి 650 ఎకరాలలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేశారు.
యువతను ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ సంస్థను ప్రముఖ పారిశ్రామికవేత్త,రాజకీయ నాయకుడు అయిన డా.పైడి ఎల్లారెడ్డి సందర్శించారు.భారత ప్రభుత్వం నుంచి కూడా ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఇతర దేశాల టెక్నాలజీని దిగుమతి చేసుకునే విధంగా ఈ పరిశ్రమ ఉంది. అలాగే రానున్న రోజుల్లో జపాన్ నుంచి కూడా పారిశ్రామిక వ్యక్తులు ఈ పరిశ్రమను సందర్శించి పెట్టుబడులు పెట్టి అవకాశం ఉంది అన్నారు.
ఇలాంటి పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యం, రాష్ట్రంలో భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టించడం మరియు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం. సుమారు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ రోడ్లు,డ్రైనేజీ అన్ని రకాల సదుపాయాలతో ఇప్పటికీ పూర్తయింది అన్నారు.
దీనికి దాదాపుగా 500 మీటర్ల దూరంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రాణహిత చేవెళ్ల 22 ప్యాకేజ్ కాలువ ఉంది. దీనిపై చాలాసార్లు మాట్లాడినా కూడా “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్టు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కనీసం పరిశ్రమ ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అందే విధంగా ఉంటుందని ఉద్దేశంతో ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఈ పరిశ్రమ ఉన్నది అని చాలామందికి తెలియకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
