తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బి.ఆర్. ఎస్ పార్టీ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఇంచార్జి బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జి, కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిధిగా పాల్గొని SIR మీద BLA కు మరియు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అవగాహన సమావేశం నిర్వహించారు. MLA కృష్ణ రావు మాట్లాడుతూ, ప్రధానంగా ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం పై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఎప్పటికప్పుడు బి.ఎల్.ఎ, బి.ఎల్.ఓ లకు అందుబాటులో ఉండి ఏదైనా సమస్య ఉంటే వాటిని సరి చేయాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల ఎవరైనా అందుబాటులో లేనప్పుడు వారి సమాచారం సేకరించి తిరిగి మళ్లీ బి.ఎల్.ఎ. బి. ఎల్.ఓ లకు వారి సమాచారం అందించి వారి ఓటును పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని, ఓటు ప్రతి ఒక్కరి పౌరుహక్కని. ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఆఫీసర్లు ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే అక్కడికక్కడే తెలుసుకుని వారు ఇచ్చిన దరఖాస్తు నింపి ఇవ్వాలని ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో BLA, బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
