తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై శేరిలింగంపల్లి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూకట్పల్లి ఎమ్మెల్యే , శేరిలింగంపల్లి ఇంచార్జ్ మాధవరం కృష్ణా రావు ముఖ్య అతిథులుగా పాల్గొని సర్ ప్రక్రియను అత్యంత బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ప్రతి బీ ఎల్ ఏ. అప్రమత్తంగా పనిచేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ఒక్క అర్హులైన ఓటరు పేరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు , నవతా రెడ్డి, విజయ్ రెడ్డి, నరేందర్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
