తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శంషిగూడ డివిజన్, శంశీగూడలో నిర్వహిస్తున్న “సర్” కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓ లు, కాంగ్రెస్ పార్టీ పార్టీ బిఎల్ఏ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్ని వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “సర్” కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, మీ పేరు ఓటరు జాబితాలో నమోదై ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటరు నమోదు వివరాలు సరైనవిగా, తాజాగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రజలందరూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో పాల్గొనాలని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్వారి శశిధర్, ప్రభాకర్, భీమ్ రావు, శ్రీనివాస్, బాబు, వెంకట్,మల్లేష్, వీరన్న,రాజన్న,నర్సింగ్ రావు,సుబ్బు, చింటూ, దర్శన్, భూమన, దయాకర్, ప్రవీణ్,దశరథ్, నాగేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండయ్య, జగదీష్, కృష్ణ, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీదేవి, నాయకులు లలిత, కృష్ణ వేణి,లక్ష్మి,యాదమ్మ, మమత, డి లక్ష్మి, అర్చన, శ్రీదేవి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
