తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, దీప్తి శ్రీనగర్ పరిధిలోని శ్రీ జగద్రక్షక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం, పీజేఆర్ ఎంక్లవే రోడ్డు, దీప్తి శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న శ్రీ వారాహి దేవి గుప్త నవరాత్రుల మహోత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మిరియాల ప్రీతమ్, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రసాద్ గురు స్వామి, పరదేశి నాయుడు, ధర్మ, కాలనీవాసులు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
