Telangana express news : కల్వకుర్తి నియోజకవర్గంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో వెలసిన బండలగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాధవి రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తికావాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
