తెలంగాణ ఎక్స్ ప్రెస్ : హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో పాటు సామరస్యపూర్వకంగా జీవించాలని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. అనంతరం, ఆలయ అర్చకులు బండి రమేష్ కి తీర్థప్రసాదాలు అందజేసి, అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో తూము వేణు, లక్ష్మయ్య, క్రాంతి, కలికోట శంకర్, రాము, శ్రీకాంత్ పటేల్, మోహిత్ తదితరులు, అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
