తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించిన మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ పాల్గొన్నారు. ఈ సందర్బంగ మల్లెల జయ మాట్లాడుతు, దేశవ్యాప్తంగా విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందిన మహా నేత మన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అని అన్నారు.