• చేనేత కార్మికులకు ఉచిత కంటి వైద్య శిబిరం
పోచంపల్లి, జూలై 21: పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ తడక రమేష్ సహకారంతో, పోచంపల్లి పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో చేనేత కార్మికులు మరియు స్థానిక ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, చేనేత కార్మికులు నిరంతరం మగ్గం వద్ద పనిచేయడం వల్ల కంటి సమస్యలు అధికంగా ఎదుర్కొంటారని, అలాంటి వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ తడక రమేష్, సహకార సంఘం అధ్యక్షులు భారత్ లవ్ కుమార్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు అంకం పాండు, వెంకటరమణ సిల్క్ సహకార సంఘం అధ్యక్షులు చింతకింది రమేష్, కౌన్సిలర్లు కొండమడుగు ఎల్లస్వామి, లింగస్వామి, మార్కండేశ్వర స్వామి కమిటీ అధ్యక్షులు సీత సత్యనారాయణ, కార్మిక సంఘం మాజీ అధ్యక్షురాలు కర్నాటి అంజమ్మ, మంగళపల్లి శ్రీహరి, భోగా విష్ణు, పాలది యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
అలాగే కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మ హరిశంకర్, కోశాధికారి రుద్ర సూర్యప్రకాష్, సహాయ కార్యదర్శి బిట్ల గణేష్, కార్యవర్గ సభ్యులు పొట్టబత్తిని వేణుకుమార్, కటకం శ్యామ్సుందర్, కూరపాటి భాస్కర్, గుండు రాజేశ్వరి, గుర్రం హేమలత, చేనేత నాయకులు శ్రీనివాస్, గుండు ప్రవీణ్, సీత కృష్ణ, కలకుంట్ల రమేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.
