తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ గోల్కొండ శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటం అలాగే రసాయనల కంపెనీల నుంచి వెలువడే పొగ వల్ల పర్యావరణంలో అనేకరకాల మార్పులు సంభవిస్తున్నాయి. చాలావరకు చెట్లను నరకడం వల్ల ప్రకృతి నాశనం అయిపోయింది ఇప్పటికి కూడా సరిగా వర్షాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలా రాష్ట్రాలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వన మహోస్తవ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందరూ మొక్కలు నాటేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది .మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు.
వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేసి ఇంటింటికీ పంపిణీ చేస్తున్న మొక్కలను తప్పనిసరిగా నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వార్డు సభ్యుడు చిట్టెడి రాకేష్ రెడ్డి, గ్రామ సచివాలయ కార్యదర్శి భార్గవి రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
