Telangana Express News : కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా భారత యువత సాధించిన ఘన విజయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత నిజం, న్యాయం, జవాబుదారీతనం కోసం చేసిన పోరాటానికి ఇది నిదర్శనమన్నారు.విద్యార్థుల సమస్యలను పార్లమెంట్ లోపల, బయట ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీతనం కోరిన ప్రతిపక్షాల పోరాటాన్ని ఆయన అభినందించారు. రాజీనామాతో సమస్య ముగిసిపోకుండా, పారదర్శకమైన, విశ్వసనీయమైన, ప్రతిభకు న్యాయం చేసే పరీక్షా వ్యవస్థ ఏర్పాటుకు ఇది నాంది కావాలని ఆకాంక్షించారు.”యువత న్యాయం కోసం ఏకమైతే ప్రజాస్వామ్యం తప్పక స్పందిస్తుంది” అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.