Telangana Express News : తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకన్న గుట్టలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగగా, భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.