
Telangana Express News : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ మందకొడిగా సాగుతోందని బీఆర్ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ తెలిపారు. నేతాజీ నగర్, వెంకటేశ్వర కాలనీ, శ్రీరామ్‌నగర్ ప్రాంతాల్లో ఎన్నికల అధికారులతో కలిసి ఇంటింటి పర్యటన నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా మంది బీఎల్ఓలు పోలింగ్ బూత్‌లకే పరిమితమవుతున్నారని, ఇంటింటికి ఎన్యుమరేషన్ ఫారాలు చేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి నేరుగా వివరాలు సేకరించి, పత్రాలు పరిశీలించిన తర్వాతే ఓటర్ల వివరాలు నమోదు చేయాలని, లేకపోతే అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ఎంఆర్వో, ఎన్నికల అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యుగేందర్ రెడ్డి, సీఓ విజయేందర్, సీఓ ఉపేందర్, వీఆర్వో సరిత, బీఎల్ఓలు అరుణ రెడ్డి, శ్రీదేవి, సురేష్, రాఘికతో పాటు కొంపల్లి జగదీష్, వెంకట్ రమణ కురువ, రామారావు, అనిల్, ఉప్పెల శ్రీను, రవి, సింహాద్రి, రిషి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
