Telangana Express News : ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు (బుధవారం) హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (ఇందిరా భవన్)లో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.సమస్యలతో ఉన్న ప్రజలు తమకు సంబంధించిన పూర్తి వివరాలు, అవసరమైన పత్రాలతో కార్యక్రమానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
