Telangana Express News : షాద్నగర్ చేనేత సహకార సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చెన్న బాలరాజును షాద్నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను కూడా అభినందించి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేసి సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో షాద్నగర్ పద్మశాలి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క పద్మశాలి సభ్యుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నూతన ప్రధాన కార్యదర్శి చెన్న బాలరాజుకు మరియు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.