తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్ఛిబౌలి డివిజన్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు నూతనంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన భూపతి ని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయిబాబా భూపతి కి శుభాకాంక్షలు తెలియజేసి, ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సమన్వయం ముఖ్యమని అన్నారు. ప్రాంత ప్రజల భద్రత కోసం కృషి చేయాలని కోరారు. నూతన ఇన్స్పెక్టర్ కూడా ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.