తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్, ప్రజ్ఞా డిగ్రీ అండ్ పి.జీ కాలేజ్ లో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఎస్ఐఆర్ అవగాహన కల్పించారు. చదువుకునే విద్యార్థులు ఓటు ఉన్న వారు ఎస్ఐ ఆర్ కార్యక్రమంలో ఓటు నమోదు చేసుకోవాలని, వారి తల్లితండ్రులకు, బంధువులకు ఫారం నింప్పడం లో సహాయ సహకారాలుణఅందించాలని మీ ఓటు మీ హక్కు మీ బాధ్యత అని ప్రతి ఒక్కరు గ్రహించాలని, భారత ఎన్నికల సంగం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో అర్హులైన ఓటరు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా ధ్రువికరించుకోవలని, ఇతరులకు కూడా సహకరించాలని, ఓటు హక్కు కలిగి ఉంటేనే ప్రజాసౌమ్యం పరిరక్షణలో, సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అని, అందుకే ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ కార్యక్రమంన్నీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ వీ రాజు, చందర్ రావు, సలీం, శభన బేగం, శ్రీనివాస్ , నగేష్ రెడ్డి, వంశీ రెడ్డి, జెవీ.రావు అనంత రెడ్డి, అంజి యాదవ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.