తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్:  దేశ సమగ్రత, శాంతిభద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్న కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) వీర జవాన్లకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పాటు దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. దేశ ప్రజల భద్రత కోసం విధేయతతో, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల సేవలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. జవాన్ల దేశభక్తి, నిస్వార్థ సేవా తత్వం యువతకు ఆదర్శమని పేర్కొన్న ఆయన, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని సీఆర్పీఎఫ్ సిబ్బంది, వారి కుటుంబాల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు.