తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్న కోడూర్ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండల పరిధిలోని చౌడారం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నకొడూరు సీఐ శ్రీ సిహెచ్. విద్యాసాగర్, ఎస్‌ఐ శ్రీ బి. చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో గ్రామ పరిసరాల్లో ఉత్సాహంగా మొత్తం 120 మొక్కలను నాటారు.ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి వృక్షాలుగా మారే వరకు ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. పచ్చని వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వనమహోత్సవంలో గ్రామస్తులు, యువకులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.