హైదరాబాద్: తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.
