తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ డా. యలమంచి ఉదయ్ కిరణ్, శ్రీకాంత్,మధు, నవీన్,చిరంజీవి, రత్నాచారి, సతీష్ ,వినోద్ లతో కలిసి మియాపూర్ నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. జయరామ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్. జయరామ్ ను శాలువాతో సత్కరించి, మొక్కను అందజేసి, నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మియాపూర్ ప్రాంతంలో శాంతిభద్రతలు, ప్రజా భద్రత మరింత పటిష్టం కావడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సీఐ ఎన్. జయరామ్ నాయకత్వం కీలకంగా ఉంటుందని యలమంచి ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ప్రాంత సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పోలీసు శాఖకు, స్థానిక ప్రజలకు మధ్య సత్సంబంధాలు, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
