తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, తారానగర్ లోని గోపినాధ్ ఫంక్షన్ హాల్ లో శ్రీమతి ముత్యాల లక్ష్మి రమేష్ ల చిన్న కూతురు పగడాల ఉదయ వందన జయసాయి ల ప్రధమ పుత్రుడు చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ కు 30వ తేదీ గురువారం బారసాల మరియు నామకరణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగ కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలలో స్థానిక ముఖ్య నేతలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో హాజరై చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ ను ఆత్మీయతగా ఆశీర్వదించారు. అనంతరం, ముత్యాల లక్ష్మి రమేష్ లు మాట్లాడుతు, బారసాల మరియు నామకరణ మహోత్సవ వేడుకలకు విచ్చేసి చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ కు శుభాశీర్వచనాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.
