తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్, చందానగర్, హఫీజ్ పెట్, భారతి నగర్ డివిజన్ లలో శ్రీ షిర్డీ సాయి మందిరంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నాయకులు సాయి బాబా,జీవి రెడ్డి, వీరేందర్ గౌడ్,యాదగిరి గౌడ్, రాజేష్, ప్రభాకర్, రవీందర్ రెడ్డి,కట్ల శేఖర్ రెడ్డి, శ్రీనివాస్,శివ, డివిజన్ అధ్యక్షులు గిరి బాబు, నాయకులు ఒరిటి వెంకట్ రావు, గిరీష్, ప్రవీణ్ గౌడ్,రాము,నర్సింగ్ రావు, రాజు నాయక్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.