తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదీనాగూడ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ నందు నిర్మిస్తున్న కల్వర్ట్ నిర్మాణ పనుల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రమాదవశాత్తు కాలువలో పడిన వ్యక్తి గల్లంతైన విషయం తెలుసుకొని ప్రమాద స్థలాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో, సీఎంసీ అధికారులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరద నీరు పూర్తిగా నిండి నిర్మాణ దశలో ఉన్న లోతట్టు ప్రాంతం పూర్తిగా నిండి పోయిందని,స్థానికంగా ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని,ముందస్తు జాగ్రత్తలతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వర్షాకాలం నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసి, ముందస్తు చర్యలు చేపట్టిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు ముదిరాజ్,రవీందర్ రెడ్డి,మన్నేపల్లి సాంబశివ రావు, కట్ల శేఖర్ రెడ్డి, నర్సింగ్ రావు, కృష్ణ గౌడ్, రామచందర్, భరత్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.