తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బీ బ్లాకు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో ప్రేమ్ నగర్ వాసి బాలయ్య 70సం.గల్లంతు అవ్వటం జరిగింది. ఈ విషయం తెలియగానే కొండాపూర్ డివిజన్ బి.ఆర్.ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి అల్లావుద్దీన్ పటేల్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను వేగవంతం చేయాలని పోలీసు, హైడ్రా,సీ ఎమ్ సీ. ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులను కోరారు. బాలయ్య కుటుంబ సభ్యులను మొహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
