తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు పోలీస్ కానిస్టేబుల్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ (స్క్రీనింగ్) పరీక్ష ఆగస్టు 2, 2026 (ఆదివారం) ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించబడుతుంది ఈ ప్రవేశ పరీక్షను మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మరియు మహర్షి స్కూల్ కేసముద్రం రోడ్ పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు ఇప్పటికే తమ పేర్లు నమో దు చేసుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకొని పరీక్షకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ డా.శబరీష్ సూచించారు రవాణా సౌకర్యం అవసరమైన అభ్యర్థులు తమ సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు అవసరాన్ని బట్టి సంబంధిత పోలీస్ స్టేషన్ల నుండి పరీక్షా కేంద్రాలకు వాహనాల ఏర్పాటు చేయబడుతుంది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలని జిల్లా పోలీసులు ఆకాం క్షిస్తూ పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్ ఐపీఎస్ హృదయపూర్వక శుభా కాంక్షలు తెలిపారు.