TRSMA అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహబూబాబాద్ విద్యార్థులు

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ఆధ్వర్యంలో నిర్వహించిన “Inspiring Session for Students” కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహబూబాబాద్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారుఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మహబూబాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డా.పి.శభరీష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు యుక్తవయస్సులో మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు చెడు అలవాట్లు చెడు స్నేహాలకు దూరంగా ఉండి విద్య, క్రమశిక్షణ నైతిక విలువలను జీవితంలో ఆచరించాలని విద్యార్థులకు సూచించారు ప్రతి విద్యార్థి తన కుటుంబానికి సమాజానికి ఆదర్శంగా నిలిచి మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహబూబాబాద్ డైరెక్టర్ డా. జె. ప్రమోద్ రెడ్డి  మరియు మహేంద్ర రెడ్డి విద్యార్థులతో కలిసి హాజర య్యారు అనం తరం జిల్లా ఎస్పీ డా. పి. శభరీష్ గారిని శాలువాతో సత్కరించి యువతలో చైతన్యం కల్పించేందుకు ఆయన చేస్తున్న సేవలను అభినందించారు విద్యార్థులకు నాణ్య మైన విద్యతో పాటు సామాజిక బాధ్యత వ్యక్తిత్వ వికాసం దేశభక్తి నైతిక విలువలను పెంపొందించడంలో ఎల్లప్పు డూ ముందుండే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహబూబాబాద్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం ద్వారా సమాజానికి బాధ్యతగల భావి పౌరు లను తీర్చిదిద్దాలనే తన లక్ష్యాన్ని పాఠశాల కొనసాగి స్తోంది.