తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ :చిన్నకోడూరు అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ, బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను సభలో చదివి వినిపించారు. అనంతరం మహేందర్ యాదవ్ మాట్లాడుతూ అధికారులు నిరంతరం గ్రామాలను సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మండల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు తమ పరిధిలోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ.. సభలో వ్యక్తమైన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, అవసరమైతే జిల్లా ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లైనా పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు కనకరాజు, వెంకట్ రెడ్డి, ఎంపీడీఓ జనార్దన్, తహశీల్దార్ సలీమ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
