శనివారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పురుషోత్తం, రెవెన్యూ డివిజనల్ అధికారి క్రిష్ణవేణి, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్, ఈడబ్ల్యూ ఐసి, సంబంధిత అధికారులతో కలిసి రెండు పడకల గదుల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు,
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి అందించాలని అందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు, రెండు పడకల గదుల నిర్మాణం క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణాలు పూర్తి అయిన వాటిని లబ్ధిదారులకు అందించాలని తెలిపారు,
అసిస్టెంట్ ఇంజనీర్స్ హౌసింగ్ క్షేత్రస్థాయిలో ఇండ్ల నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వివిధ దశలవారీగా నిర్మాణంలో ఉన్న ఇండ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు మంజూరు చేయుటకు సిఫారసు చేయాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు, బిల్లుల వ్యవహారంలో ఎవరైనా లబ్ధిదారుల నుండి డబ్బులు అడిగినా మరి ఇతర ఇబ్బందులకు గురి చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు,
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
