ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
న్యూస్ డెస్క్ : డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ బంగ్లా భార్గవ్ ఫంక్షన్ హాల్ లో విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ పట్టణం విఎన్ఆర్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ లు పాల్గొన్నారు,

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాల ప్రధాన ఉద్దేశ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కొనసాగుతుందని, ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించడం మరియు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి అమలుపరచడం జరుగుతుందన్నారు,
1. ఆరు గ్యారంటీల అమలు తీరు
సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల ప్రస్తుత స్థితిగతులఅమలు
మహాలక్ష్మి పథకం: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారూ రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రక్రియ ఎలా జరుగుతోంది?
గృహజ్యోతి: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఎంతమందికి అందుతోంది? జీరో బిల్లుల జారీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారం.
ఇందిరమ్మ ఇళ్లు: నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణానికి ఎంపికైన లబ్ధిదారుల జాబితా మరియు నిధుల విడుదల.
చేయూత: పెంచిన పింఛన్ల పంపిణీ మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల పరిశీలన.
2. ప్రజాపాలన దరఖాస్తుల పరిష్కారం
ప్రజాపాలన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయడం.
అర్హత ఉండి, ఇంకా కార్డులు రాని వారి కోసం రీ-వెరిఫికేషన్ (పునఃపరిశీలన) ప్రక్రియ.
రేషన్ కార్డుల జారీ మరియు మార్పుల కోసం వచ్చిన అభ్యర్థనల స్థితి.
3. నియోజకవర్గ అభివృద్ధి పనులు
పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాలు, మరియు డ్రైనేజీ పనులకు నిధుల కేటాయింపు.
స్థానిక విద్యాసంస్థలు (గురుకులాలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) బలోపేతం.
నియోజకవర్గ అభివృద్ధి నిధుల (CDP) వినియోగంపై సమీక్ష.
4. వ్యవసాయం మరియు సాగునీరు
రైతు భరోసా: పెట్టుబడి సాయం పంపిణీ మరియు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి.
పంట రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు మరియు అమలుపై స్థానిక నాయకులతో చర్చ.
రాబోయే సీజన్ కోసం విత్తనాలు, ఎరువుల లభ్యతపై ముందస్తు ప్రణాళిక.
5. పరిపాలనలో పారదర్శకత
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రహిత పాలన అందించడం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు,
మహబూబాబాద్ పట్టణం విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు కొనసాగిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని రానున్న రోజుల్లో షెడ్యూల్ ప్రకారం జరిగే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని అన్నారు,
రైతులకు వాణిజ్య పంటలు, నేచురల్ వ్యవసాయం అధిక లాభాలు కలిగిన అంతర్పంటల వైపు ముగ్గు చూపే విధంగా వ్యవసాయ ఉద్యానవన సంబంధిత శాఖలు చైతన్య పరచాలని సూచించారు,
స్వీయ జనగణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు,
యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో పయనించడం కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కృషి చేయాలని వారికి మానసిక ఆరోగ్య స్థితిగతులపై శిక్షణ ఇప్పించాలన్నారు,
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పురుషోత్తం, మహబూబాబాద్ ఆర్డీవో క్రిష్ణవేణి, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
