తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ గోపీనగర్ కాలనీలో జనచైతన్య ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తూ మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించినటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంలో కృతిక డెంటల్ కేర్ వారిచే ఉచిత డెంటల్ చెకప్ శిబిరం, స్కంద హాస్పిటల్ వారిచే ఉచిత హెల్త్ చెకప్ శిబిరాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత. పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. అంబేద్కర్ భవన్ జనచైతన్య ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి ప్రధాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముందస్తు జన్మదినంను పురస్కరించుకుని ఈ ఉచిత వైద్య శిభిరాలను ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ శిబిరాల్లో బీపీ, షుగర్,ఈసీజీ, డెంటల్ చెకప్ తో పాటు పలు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అర్హులైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కంద హాస్పిటల్స్ డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ మనోగ్న, డాక్టర్ రాజేశ్వరి దేవి, అంబేద్కర్ భవన్ జనచైతన్య సంఘం అధ్యక్షులు బజార్గట్ రమేష్, బాపునగర్ హనుమాన్ యూత్ అధ్యక్షులు రాజ్ కుమార్, గొడవర్తి సందీప్, ఉప్పరి సత్యనారయణ, సుధాకర్ రెడ్డి, రవీందర్, ముంతాజ్ బేగం, సాయినాథ్, రాధిక, పద్మ, నర్సింహా,తుకారాం, రాజేందర్, యేసు, దేవ ప్రసాద్, దస్తగిరి, ఎజాస్, తిరుమల చారీ, కుమ్మరి, కుమార్, ఖలీం, విజయ్ కుమార్, కృష్ణ గౌడ్, శ్రావణ్, బాలరాజ్, యునుస్, వైద్య సిబ్బంది స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు