తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నల్లగండ్ల డివిజన్ టీఎన్జీఓ కాలనీలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు , గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, భక్తులకు ప్రసాద వితరణచేసి, ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
