తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ స్థానిక అమ్మవారి దేవాలయ నిర్మాణం మరియు మంచినీటి సమస్యలపై పిఎసి చైర్మన్ , శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అమ్మవారి దేవాలయ నిర్మాణం మరియు మంచినీటీ సమస్యలను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి వివరించారు. వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్ తో రోజూ ఉదయం వేళలో నీటిని విడుదలచేయాలని ఆదేశించారు. అలాగే సరఫరా సమయాన్ని కూడా కొంత పెంచాలని సూచించారు. అమ్మవారి దేవాలయ విషయంపై ప్రత్యేకంగా చర్చిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు , యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వారందరికి పేరుపేరునా బలరామ్ యాదవ్ ధన్యవాదములు తెలిపారు.
