తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పట్నం రుక్కమ్మ పరమపదించిన నేపథ్యంలో దశదిన కర్మ అనంతరం అంత్యక్రియలలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ (వారణాసి)లోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణేశ్వరి మాత ఆలయాలను దర్శించుకుని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగానదిలో మాతృమూర్తి అస్థికలను నిమజ్జనం చేసే పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్నం నరేందర్ రెడ్డి, పట్నం అవినాష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితర కుటుంబ సభ్యులు పాల్గొని మాతృమూర్తికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
