{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"square_fit":1,"adjust":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధునిక సాంకేతిక విజ్ఞానం మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప సాధనమని, అయితే దానిని దుర్వినియోగం చేస్తే సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) పేర్కొన్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఐ ఫోకస్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మైత్రి వారధి–2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించే ధోరణి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన జేపీ, సాంకేతికతను మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఉప యోగించాలని సూచించారు. కుటుంబ విలువలను కాపాడు కోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. దేశంలో సుమారు 54 కోట్ల మంది పనిచేస్తుండగా, నెలవారీ జీతం పొందేవారు కేవలం 8 నుంచి 9 కోట్ల మందేనని, మిగిలిన వారు స్వయం ఉపాధి, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, సేవా రంగాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. అలాంటి శ్రమజీవులే నిజమైన దేశ నిర్మాతలని కొనియాడారు. చైనా వంటి దేశాల్లో విద్యుత్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోందని, భారత్ కూడా సాంకేతికతను ప్రజల అవసరాలకు అనుగుణంగా స్వీకరిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఐ ఫోకస్ మిషన్ సమగ్రత, బాధ్యత, భారతీయత వంటి విలువలను సమాజంలో పెంపొందించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు..ఈ కార్యక్రమంలో ఆకెళ్ల రాఘవేంద్ర, జేబీవీ సుబ్రహ్మణ్యం, డా. డీవీ రమణమూర్తి, డా. జేఎన్ రెడ్డి, వాసుదేవ శర్మ, రామరాజు, జె. కనకదుర్గ, శ్రీధర్, పి. సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రతినిధులు ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించగా, కర్వాన్‌కు చెందిన బి. శరణ్యకు విశిష్ట సేవలకు గుర్తింపుగా అవార్డు సర్టిఫికెట్ అందజేశారు.