తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఖాదర్ ఖాద్రి మాతృమూర్తి మంగళవారం స్వగృహంలో కన్నుమూశారు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ఖాద్రి నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు..అనంతరం ఖాదర్ ఖాద్రిని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా, కడ్తాల్ సర్పంచ్, ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి, సర్పంచ్ డోకూరి ప్రభాకర్ రెడ్డి, ఆమనగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్, మాజీ ఎంపీపీ అనిత విజయ్, ఫిరోజ్, అలీమ్, శివ తదితరులు పాల్గొన్నారు.
