తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆగష్టు 2 స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఐ ఫోకస్ మైత్రి వారధి 2026 కార్యక్రమం ఖైరతాబాద్ లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా జరిగింది. ఐ ఫోకస్ చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో మరియు ఐ ఫోకస్ సోల్జర్స్ అద్భుత ప్రతిభ పాట వాళ్ళతో ఈ కార్యక్రమం కొనసాగింది. ముఖ్యఅతిథిగా బహు మేధావి జయప్రకాశ్ నారాయణ హాజరై, అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఐ ఫోకస్ లాంటి సంస్థలు ప్రతి వాడవాడలో వెళ్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అందరూ అతిరథ మహారధులు పాల్గొని తమ ఆనందాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జైత్రయాత్ర వందల మందితో ప్లకార్ట్స్ ప్రదర్శిస్తూ ఐ ఫోకస్ సోల్జర్స్ యాత్ర నిర్వహించారు. అనంతరం అద్భుతమైన విందుతో ఈ కార్యక్రమం ముగిసింది.