తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్‌విల్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భోజన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మియాపూర్ కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన హోటల్‌ను మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, పట్వారీ శశిధర్, ప్రభాకర్, సంగమేశ్వర్, గౌస్, మన్నేపల్లి సాంబశివరావు, వాసు, రవి, నవాజ్, ఖాజా, రెహ్మాన్, తహేర్, కైసర్, అబ్దుల్, కలీల్,శేషు, ఇంతియాజ్, బాబ్జీ, ప్రవీణ్, మోహన్, నాగేశ్వరరావు, నాగరాజు, రాజ్‌కుమార్, శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రమాదేవి, స్థానికప్రజలు, తదితరుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
