తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని కరుణాకటాక్షాలు ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కాలనీ ప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.