తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్ దేవ్‌పల్లి పరిధిలో సోమవారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పలు అమ్మవారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. మైలర్ దేవ్‌పల్లి ప్రాంతమంతా బోనాల సంబరాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
