తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 77,394 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 31,129 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.4.72 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే 4.09 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.37 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రస్తుతం సర్వదర్శనం (SSD టోకెన్లు లేని భక్తులు) కోసం వేచి ఉన్న భక్తులు శిలాతోరణం వెలుపల ఉన్న కంపార్ట్‌మెంట్‌ల వరకు ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.
