తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికా రులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా, పరీక్షా కేంద్రాల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కోచింగ్ సెంటర్లపై నిఘా పెంచాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, నకిలీ వెబ్‌సైట్లు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే దళారులపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.