తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆషాఢ మాస బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ మహిళా సిబ్బంది అమ్మవారికి బోనాలు సమర్పించి, వడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు సురేందర్ రెడ్డి, మల్లయ్య, ఏఎంసీతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.