తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మదినగూడ డివిజన్ హుడాకాలనీ పరిధిలో నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ స్పందన్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్వహించిన10కోట్ల మంది మత్తు వ్యసన రహిత ప్రతిజ్ఞ మహా ప్రచారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్, రఘునందన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొని మత్తు వ్యసన రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. సమాజంలో మత్తు వ్యసనాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారీస్ సంస్థ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అధికారులు, సామాజిక కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సౌందర్య రాజన్ శ్రీహరి, చంద్ర శేఖర్ , మస్తాన్ రెడ్డి మోసిన్ నారాయణరెడ్డి శేఖర్ త్రిలోచన్ కార్యకర్తలు పాల్గొని మత్తు వ్యసన నిర్మూలనకు తమ మద్దతు ప్రకటించారు