తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కాటేదాన్, మైలార్దేవ్పల్లి డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వివిధ దేవాలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటాల ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, భక్తి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ మాట్లాడుతూ, కార్తీక్ రెడ్డి నాయకత్వంలో డివిజన్లో బోనాల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షుడు గుమ్మడి కుమార్, పార్టీ సీనియర్ నాయకులు రమేష్ ముదిరాజ్, రాము యాదవ్, రాఘవేందర్ యాదవ్, రాజేష్ యాదవ్, కార్మిక శాఖ విభాగ్ అధ్యక్షుడు ఉప్పల్ శ్రీను, ప్రవీణ్, మైసి రెడ్డి, వెంకటరమణ, సునీల్, మహేష్, సమ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అఖిల్, నిఖిల్, నితిన్, చిరు, పవన్, అనిల్, చిన్న, కొన్నీ, సోను, దీపు, గాంధీ, చింటూ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
