తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం , మియాపూర్ సర్కిల్ సిఎంసి-48పరిధిలోని దీప్తి శ్రీనగర్ డంపింగ్ యార్డ్‌లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ హైదరాబాద్ చైర్మన్ ఎత్తరి గోపి మాట్లాడుతూ, కార్మికులపై జరుగుతున్న అన్యాయాలను తీవ్రంగా ఖండించారు. వైస్ చైర్మన్ పులి గిరి, సిఎంసి చైర్మన్ సత్యరెడ్డి, మియాపూర్ సర్కిల్ ప్రెసిడెంట్ రాజు కార్మికుల సమస్యలపై తమ మద్దతు తెలిపారు. అదేవిధంగా శేరిలింగంపల్లి కన్వీనర్ వారణాసి గోపి, జకరయ్య, వెంకటేష్, ఓబులేష్, నరసింహ, సుంకయ్య, కళ్యాణ్, కుమార్, లక్ష్మణ్, అంజి తదితర నాయకులు, కార్మికులు పాల్గొని, కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను డిమాండ్ చేశారు. కార్మికుల జీవనోపాధి కాపాడాలని, వారికి న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
