తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలో కాలనీలోని ప్రధాన రహదారిలో మంజీరా పైపు లైన్ లీకేజీతో వృధాగా రోడ్డుపై నీరు పారుతున్న దృశ్యాన్ని పాపిరెడ్డి కాలనీలోని సీనియర్ మహిళా నాయకురాలైన కే. కనకలక్ష్మి గ్రహించి త్వరితగతిన జలమండలి అధికారులకు సమాచారాన్ని అందించారు. మంజీరా పైపు లీకేజీ సమాచారాన్ని అందుకున్న మరుక్షణమే అధికారులు సానుకూలంగా స్పందిస్తూ లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించి సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమాచారాన్ని అందించిన కె. కనకలక్ష్మిని, జలమండలి సిబ్బందిని నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టినందుకు అభినందిస్తూ, ధన్యవాదాలు తెలియజేశారు.
