తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి.ఎన్. సత్యనారాయణ యాదవ్ 16వ వర్ధంతి సందర్భంగా నర్కుడ గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్కుడ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్, సంజయ్ యాదవ్, శ్రీధర్ యాదవ్, ప్రింట్ అభిషేక్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పి.ఎన్. సత్యనారాయణ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పి.ఎన్. సత్యనారాయణ యాదవ్ ప్రజాసేవలో విశిష్ట సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని, ఆయన సేవలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
