తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ పండితులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.