తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సికింద్రాబాద్ లష్కర్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బుధవారం కురుమల సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. భోలక్‌పూర్ బీరప్ప గుడి నుంచి ప్రారంభమైన భక్తుల ఊరేగింపు మల్లన్నగుడి, బన్సీలాల్‌పేట్, సుభాష్‌రోడ్, కురుమ బస్తీ, పెద్దమ్మ గుడి తదితర ప్రాంతాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా “జై మహంకాళి” నామస్మరణతో ఆలయ పరిసరాలు భక్తిరసంతో మారుమ్రోగాయి.కురుమలు వందల ఏళ్లుగా మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం తమ సాంప్రదాయమని పెద్దలు తెలిపారు. తమ కులదైవాలైన అక్క మహంకాళి, బీరప్ప, మల్లన్న దేవతలకు రాష్ట్రవ్యాప్తంగా బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా సికింద్రాబాద్‌లో కురుమలు తమ పూర్వ వైభవాన్ని చాటేలా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సరిత తిరుపతయ్య, బీజేపీ సీనియర్ నాయకుడు చీర సత్యనారాయణ, మహంకాళి దేవాలయ కమిటీ సభ్యుడు సోనాలి సునీల్ కురుమ, హెచ్‌పీకేఎస్ అధ్యక్షుడు మధారం కృష్ణ, హెచ్‌పీకేఎస్ వ్యవస్థాపకుడు, హైదరాబాద్–పాలమూరు జంట నగరాల అధ్యక్షుడు కొల్లంపల్లి శ్రీనివాస్, కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్, మాజీ కౌన్సిలర్ నటరాజ్, కొంగల పాండు, వన్నడి రమేష్, సునీల్, జాట్రామ్ శ్రీను, ఉప్పల్ శ్రీను, వేణుగోపాల్, రిషి, దినేష్, శివతో పాటు పెద్ద సంఖ్యలో కురుమ కులస్థులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
